Nita Ambani కొత్త కారు.. ధ‌రెంతో తెలుసా?

Nita Ambani: రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ స‌తీమ‌ణి నీతా అంబానీ కొత్త కారుని కొనుగోలు చేసారు. రోల్స్ రాయిస్ ఫాంట‌మ్ VIII EWB అనే కారును త‌న గ్యారేజ్‌లో చేర్చుకున్నారు. రోజ్ క్వార్ట్స్ రంగుతో ఆర్కిడ్ వెల్వెట్ ఇంటీరియ‌ర్స్‌తో నీతా దీనిని డిజైన్ చేయించుకున్నారు. ఇలాంటి డిజైన్‌తో త‌యారైన‌ కారు ఇండియాలో నీతా అంబానీ వ‌ద్ద మాత్ర‌మే ఉంది. ఎక్కువ‌గా ఇలాంటి డిజైన్ ఉన్న కార్లు విదేశాల్లో ఉంటాయ‌ట‌. ఇంత‌కీ దీని ధ‌రెంతో తెలుసా? అక్ష‌రాలా రూ.12 కోట్లు. మరి అంబానీ ఇంటి కారంటే ఆ మాత్రం ధ‌ర ఉండాలి క‌దా.