Dhanush: విడాకులకు దరఖాస్తు చేసుకున్న జంట
Dhanush: ప్రముఖ తమిళ నటుడు ధనుష్.. అతని సతీమణి ఐశ్వర్య ఈరోజు విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. రెండేళ్ల క్రితం తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లలకు తల్లిదండ్రులంగా ఉంటాం అని తమ మధ్య ఆ స్నేహం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి కలిసిపోయారన్న టాక్ కూడా వచ్చింది. రెండేళ్ల పాటు దూరంగా ఉన్న వీరిద్దరూ విడాకులు తీసుకోవాలనే నిర్ణయించుకున్నారు. దాంతో ఈరోజు చెన్నైలోని ఓ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
2004లో ఐశ్వర్య, ధనుష్ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరి పేరు లింగా, మరొకరి పేరు యాత్ర. ఆ తర్వాత ఐశ్వర్య దర్శకత్వం వహించిన 3 సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. ఈ సినిమాల్లో రిలీజ్ అయినప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ మొన్న రీరిలీజ్ అయినప్పుడు మాత్రం ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేసారు.