Kavitha: బిగ్ షాక్.. నో బెయిల్
Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ ఎదురైంది. తాను పెట్టుకున్న మధ్యంతర బెయిల్ విషయంలో కవితకు కోర్టులో చుక్కెదురైంది. ఈరోజు కోర్టు తీర్పు వెల్లడిస్తూ బెయిల్ ఇవ్వడం లేదని వెల్లడించింది. రేపు కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. దాంతో రేపు ఆమెను కోర్టులో మళ్లీ ప్రవేశపెడతారు. రేపు మళ్లీ రిమాండ్‌ను పొడిగించే అవకాశం కూడా ఉంది.