Vijay Devarakonda: స్టార్ కిడ్ అయ్యుంటే ఇలా టార్గెట్ చేసేవారా?
Vijay Devarakonda: టాలీవుడ్లో విజయ్ దేవరకొండకు ఒక మంచి పేరు ఉంది. చిన్నా చితకా రోల్స్ చేసుకుంటూ అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరి అండదండలు లేకుండా సొంతంగా ఎదిగాడు. ఈరోజు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. విజయ్ ఎవ్వరినీ కాపీ కొట్టాలని అనుకోడు. తనకంటూ ఒక యాటిట్యూడ్, మేనరిజాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే అతనికి ఫ్యాన్స్‌లో అంత క్రేజ్ ఉంది.
కానీ పాపం విజయ్ ఈ మధ్యకాలంలో ఏం చేసినా కాంట్రొవర్సీ అయిపోతోంది. ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) మొన్న శుక్రవారం రిలీజ్ అయింది. సినిమా అసలు బాలేదని.. విజయ్ ఓవరాక్షన్, ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పోయిందని నెగిటివ్ రివ్యూలు బాగా వచ్చాయి. అదేదో పనికట్టుకుని మరీ విజయ్ సినిమా చూసి కావాలనే సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తోంది. దాంతో విజయ్ దేవరకొండ అభిమాని ఒకరు మాదాపూర్‌లో సైబర్ కంప్లైంట్ చేసాడు. విజయ్‌పై కావాలనే నెగిటివిటీ చేస్తున్నారని.. తప్పుడు రివ్యూలు చెప్పి మంచి సినిమాను చెడగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిజానికి ఇప్పటివరకు ఇలాంటి కంప్లైంట్ అనేది ఏ హీరో లేదా హీరోయిన్‌పై జరిగి ఉండదు. తమపై తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలు చేస్తే పోలీసులను సంప్రదించినవారు ఉన్నారు కానీ ఇలా ఒక సినిమా గురించి హీరోను టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదు జరగడం అనేది ఇదే మొదటిసారి. అసలు విజయ్ విషయంలో ఇలా ఎందుకు జరుగుతోంది? విజయ్ స్టార్ కిడ్ కాదనా? ఒకవేళ విజయ్ కూడా ఏ సూపర్ స్టార్ లేదా మెగా ఫ్యామిలీకో చెంది ఉంటే ఇన్ని విమర్శలు ఎదుర్కొనేవాడా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. స్వయంకృషితో ఎదిగి తనకంటూ పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న యువ హీరోల పట్ల ఇలాంటి నెగిటివిటీ చూపిస్తే బయటి నుంచి ఎవరైనా ఇండస్ట్రీకి వస్తారా?