Vijaya Sai Reddy: సూప‌ర్ సిక్స్ అంటే ఇదే

Vijaya Sai Reddy: తెలుగు దేశం పార్టీ (Telugu Desam party) అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ మేనిఫెస్టోపై సెటైర్ వేసారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ఏవో పేర్లు చెబుతున్నాడని సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావని అన్నారు. పొరపాటున గెలిస్తే తాను, తన పుత్రరత్నం లోకేశ్, వదిన పురంధేశ్వరి, యనమల రామకృష్ణుడు, పొంగూరు నారాయణ, నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్‌లు చక్రం తిప్పుతారని సంకేతం ఇస్తున్నారు. వీళ్లు ఆరుగురు బాగు పడితే చాలనేది బాబు కోరిక అని సెటైర్ వేసారు.