Warangal: సినిమా స్టోరీ రిపీట్ .. వదినతో కాపురం చేసి.. మోసం చేసి..
Warangal: హిందీలో హసీన్ దిల్రుబా అనే సినిమా రిలీజ్ అయ్యింది. అందులో తాప్సి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఇందులో హీరోయిన్ తన మరిదితో ఎఫైర్ పెట్టుకుని కాపురం చేస్తుంటుంది. అచ్చం ఇలాంటి ఘటనే వరంగల్లో చోటుచేసుకుంది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బజ్జుతండా శివారు చిన్నతండాకు చెందిన జాటోత్ రాజుకు ఎల్లాయగూడేనికి చెందిన మమతను ఇచ్చి 2017లో పెళ్లి చేశారు. పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు రాజుకు పిల్లలు పుట్టరని తేల్చి చెప్పారు. దీంతో మమత.. భర్తతో కాపురం చేయలేనని చెప్పి పుట్టింటికి వెళ్లింది. కొద్దిరోజుల తరువాత అత్త భద్రమ్మ, మామ నర్సింహ, మరిది శ్రీను.. మమత వద్దకు వెళ్లి పిల్లలు పుట్టేందుకు ఆస్పత్రిలో చూపిస్తామని చెప్పి కాపురానికి తీసుకువచ్చారు. కానీ ఆ దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.
ఈ క్రమంలో ఓ రోజు నీ భర్త రాజుకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారు. ఈ విషయం నీకు తెలుసుకదా. నువ్వు (మరిది) శ్రీనుతో కలిసి కాపురం చేయగలిగితే నీకు పిల్లలు పుడతారు అని అత్తామామలు ఒత్తిడి చేశారు. ఈ విషయాన్ని ఆసరా చేసుకొని అందరం కలిసి సంతోషంగా ఉందాం… ఆస్తిపాస్తులు అనుభవిస్తామని నమ్మబలికిన శ్రీను మమతతో కాపురం చేస్తూ వస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు.
దాంతో కొంతకాలం పాటు వీరి కాపురం గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. కొంతకాలంగా అత్తామామ, మరిదిలు తరచూ ఆమెతో గొడవ పడుతూ పుట్టింటికి వెళ్లిపోవాలని ఒత్తిడి చేసి 20 రోజుల క్రితం ఆమెను కొట్టి పుట్టింటికి వెళ్లగొట్టారు.
అనంతరం శ్రీను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మమత చిన్నతండాకు వచ్చి నిలదీసింది. శ్రీను.. ఆమెను దూషించి వేరే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు. దీంతో మామత పోలీసులను ఆశ్రయించింది. దాంతో మమత అత్తామామలు, శ్రీను కలిసి పన్నిన కుట్ర బయటపడింది.