Hardik Pandya: ఈసారైనా గెలిచేలా ఆశీర్వ‌దించు స్వామీ..!

Hardik Pandya: ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్య‌కు ఈ మ‌ధ్య ఏమీ క‌లిసి రావ‌డంలేదు. కెప్టెన్‌గా మారాడ‌న్న మాటే కానీ ఇప్ప‌టివ‌ర‌కు జరిగిన ఒక్క IPL మ్యాచ్‌లోనూ గెల‌వ‌లేదు. దానికి తోడు ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఫ్యాన్స్ ఎగ‌తాళులు తారా స్థాయికి చేరాయి. దాంతో త‌దుప‌రి మ్యాచ్ కంటే ముందు హార్దిక్ దైవ ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని అనుకున్నారు. ఇందుకోసం గుజ‌రాత్‌లోని సోమ‌నాథ్ ఆల‌యానికి వెళ్లి శివ‌య్య‌కు అభిషేకం, పూజ‌లు నిర్వ‌హించారు. ముంబై ఇండియ‌న్స్ ఆడబోయే త‌దుప‌రి మ్యాచ్ ఆదివారం జ‌ర‌గ‌నుంది. సొంత మైదానం అయిన ముంబైలోని వాంఖెడెలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో (Delhi Capitals) త‌ల‌ప‌డ‌నున్నారు.