Nagababu: పవన్ చెప్పాడనే త్యాగం చేసా
Nagababu: కూటమి కోసమే తన సీటును త్యాగం చేసానని… జనసేన నేతలు, కార్యకర్తల, సైనికులు అంతా కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ నాగబాబు. ఈరోజు తుని నియోజకవర్గంలో ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఆయన సమావేశం ఏర్పాటుచేసారు. పిఠాపురం నియోజవకర్గం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan), కాకినాడ లోక్ సభ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ని భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు తెచ్చి కాకినాడ జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.
పొత్తు కోసం నా సీటునే త్యాగం చేసా
అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేసేందుకు తాను సిద్ధమైన సంగతి వాస్తవమే అని కాకపోతే పొత్తు పరిణామాలతో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో తాను మరుక్షణమే తప్పుకున్నానని అన్నారు. ఒక జన సైనికుడిగా పార్టీ అధ్యక్షుడి మాటను తాను ఇచ్చిన గౌరవం అని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యూహానికి అనుగుణంగా జనసేన, తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జనం ముఖాల మద కూడా జగన్ బొమ్మ గుద్దుతాడేమో..!
జగన్ మోహన్ రెడ్డికి తన ఫోటోలను ప్రచారం చేసుకోవాలనే మతి భ్రమించిన ఆలోచన తారాస్థాయికి వెళ్లిపోయిందని, ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజల ముఖంపై జగన్ రెడ్డి బొమ్మను పచ్చ బొట్టు వేస్తారనే సందేహాన్ని వ్యక్తం చేసారు. కోటి రూపాయలకు కూడా విలువ లేని పని చేసి పదికోట్ల రూపాయల ప్రజా ధనంతో పబ్లిసిటీ చేసుకోవడం జగన్ రెడ్డికి సర్వ సాధారణం అయిపోయిందని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న సంక్షేమ పథకాలకు పేరు మార్చి జనగ్ రెడ్డి పేరు పెట్టుకోవడం ఏంటో అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.