Lifestyle: సెక్స్ టాయ్స్ వాడటం మంచిదేనా?
Lifestyle: కామసూత్ర పుట్టిన భారతదేశంలో ఇప్పటికీ సెక్స్ గురించి భార్యాభర్తలు, జంటలు మనసు విప్పి మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ సెక్స్ అంటే అది అనుభవించడానికే తప్ప దానికి సంబంధించిన అంశాలను నోరు తెరిచి మాట్లాడటానికి వీల్లేదు అనుకునేవారు మన దేశంలో కోకొల్లలు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంతో ముఖ్యం అని సినిమాలు తీసి మరీ చూపిస్తున్నా ఈ విషయంలో సమాజంలో మార్పు రావడంలేదు.
ఏదేమైనప్పటికీ.. భార్యాభర్తల మధ్య బంధం పదిలంగా ఉండాలంటే వారి శృంగార జీవితంలో సెక్స్ టాయ్స్ది కీలక పాత్ర అని చెప్తున్నారు నిపుణులు. చాలా మంది సింగిల్స్ ఈ సెక్స్ టాయ్స్ని వాడుతుంటారు. పార్ట్నర్ లేనప్పుడు లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఈ సెక్స్ టాయ్స్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సెక్స్ టాయ్స్ ద్వారా శృంగారాన్ని పార్ట్నర్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు ఫోర్టిస్ హాస్పిటల్లో పనిచేస్తున్న సెక్సాలజిస్ట్ ములుంద్.
ఈ సెక్స్ టాయ్స్ని ఉపయోగించం వల్ల వారి మధ్య మరింత అనుబంధాన్ని పెంచుతుందని.. సెక్సువాలిటీ గురించి మరిన్ని విషయాలు అర్థమయ్యేలా చేస్తుందని అంటున్నారు. సెక్స్ గురించి పెద్దగా తెలీని దంపతులకు మొదట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ సెక్స్ టాయ్స్ ఉపయోగపడతాయని తెలిపారు. కాకపోతే మీ భాగస్వామితో చర్చించి వారికి ఓకే అయితేనే ఈ సెక్స్ టాయ్స్ని వాడుకుంటే మంచిది. దీని గురించి మరిన్ని వివరాలను వైద్యులను సంప్రదించినా వారు క్లుప్తంగా వివరిస్తారు.