NTR బాలీవుడ్ ఎంట్రీ.. క్రేజీ స్పై యూనివ‌ర్స్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ఇండియాలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన య‌శ్ రాజ్ ఫిలింస్.. YRF స్పై యూనివ‌ర్స్ పేరుతో వార్ 2 సినిమా తీయ‌బోతోంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో తార‌క్ కూడా న‌టించ‌బోతున్నారు. అయితే అది గెస్ట్ రోలా లేక కీ రోలా అనేది తెలియాల్సి ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్.. జంజీర్ సినిమాతో ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసారు. ఇప్పుడు తార‌క్ వంతు. ఇక‌పోతే.. ఈ వార్ 2 సినిమా 2019లో వ‌చ్చిన వార్ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది. వార్ సినిమాలో హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అప్ప‌ట్లో ఈ సినిమా మంచి విజ‌యం అందుకుంది. అయాన్ ముఖ‌ర్జీ వార్ 2ను డైరెక్ట్ చేయ‌బోతున్నారు. మొత్తానికి త‌మ అభిమాన న‌టుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నందుకు ఫ్యాన్స్ సంతోషంలో మునిగి తేలుతున్నారు. వార్ 2 లో తార‌క్ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో తెలీదు కానీ.. హృతిక్‌కి విల‌న్‌గా చేస్తే మాత్రం బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోతుంద‌ని అంటున్నారు. ప్యాన్ ఇండియా పుణ్య‌మా అని టాలీవుడ్, బాలీవుడ్ న‌టీన‌టులు ఒక‌రికొక‌రు గ‌ట్టిగా స‌పోర్ట్ ఇచ్చుకుంటున్నారు. బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యే సినిమాలో తెలుగు న‌టుల‌కు ఛాన్స్ ఇవ్వ‌డంతో అక్క‌డి సినిమాలు మ‌న తెలుగు నాట కూడా ఓ మాదిరిగా మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతున్నాయి. మ‌న తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చిన త‌ర్వాత ఇత‌ర సినీ ఇండ‌స్ట్రీలు మ‌న‌తో క‌లిసి ప‌నిచేయాల‌నుకుంటున్నాయి అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు.