Sanjay Singh: రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయిస్తారు

Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) తిహార్ జైలు నుంచి విడుదలైన AAP ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో (Revanth Reddy) పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వంటి వాళ్లను కూడా కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు. వారందరితో ముఖ్యమంత్రి పదవులకు రాజీనామా చేయించేందుకు BJP సిద్ధమవుతోందని సంచ‌ల‌న కామెంట్స్ చేసారు. ఇప్ప‌టికే ఈ కేసులో భాగంగా భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌తో (Kalvakuntla Kavitha) పాట ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.