Viral News: బాలిక‌తో 63 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. సెక్స్ కోసం మాత్రం కాద‌ట‌!

Viral News: 63 ఏళ్ల పూజారి.. 13 ఏళ్ల బాలిక‌ను వివాహం చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘ‌ట‌న వెస్ట్ ఆఫ్రిక‌న్ దేశం అయిన ఘానాలో చోటుచేసుకుంది. స్థానిక అక్రా ప్రాంతానికి చెందిన సురు అనే వ్య‌క్తికి అక్క‌డ మంచి ప‌లుకుబ‌డి ఉంది. అత‌న్ని అంతా ఆధ్యాత్మిక గురువుగా భావిస్తారు. ఈ నేప‌థ్యంలో నిన్న ఆయన స్థానిక ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక‌ను వివాహం చేసుకున్నాడు. ఆ స‌మ‌యంలో తీసిన ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో పెద్ద రాద్దాంతానికి దారి తీసాయి.

దీనిపై సురు స‌మాధాన‌మిస్తూ.. క్ర‌తువులో భాగంగానే బాలిక‌ను పెళ్లి చేసుకున్నానే త‌ప్ప లైంగిక వాంఛ‌లు తీర్చుకోవ‌డానికి కాద‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇది స్థానికంగా పెద్ద చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంది. బాలిక‌ను, ఆమె త‌ల్లిని త‌మ ర‌క్ష‌ణ‌లో ఉంచుకుంది. దీనిపై విచార‌ణ జ‌ర‌గాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఘానా చ‌ట్టం ప్ర‌కారం వివాహం జ‌ర‌గాలంటే 18 ఏళ్లు నిండాల్సిందే. లేదంటే అక్క‌డ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఆ గురువుకి ఆల్రెడీ ముగ్గురు భార్య‌లు ఉన్నార‌ట‌. ఈ బాలిక‌ను మాత్రం ఓ క్ర‌తువులో భాగంగా మాత్ర‌మే వివాహం చేసుకున్నాను త‌ప్ప లైంగిక అవ‌స‌రాల కోసం కాద‌ని తాను చేసిన వెద‌వ ప‌నిని స‌మ‌ర్ధించుకుంటున్నాడు ఆ గురువు.