Ambati Rayudu: RCB అందుకే టైటిల్ గెలవలేకపోతోంది
Ambati Rayudu: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. దాంతో అభిమానులు ఈసారి కాకపోతే వచ్చే సారి కొడతారు అనుకుంటూ సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సొంతం చేసుకుంది. దాంతో రాయల్ ఛాలెంజర్స్ టీంకు ఇప్పుడు విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయింది.
అయితే రాయల్ ఛాలెంజర్స్ టీంకు ఎందుకు టైటిల్ వరించడంలో వెల్లడించారు సీనియర్ క్రికెటర్ అంబటి రాయుడు. రాయల్ ఛాలెంజర్స్ టీంకి బౌలింగ్, బ్యాటింగ్‌లో స్థిరత్వం లేదని అన్నారు. బౌలింగ్ విషయంలో ఓవర్‌గా ఉంటారు కానీ బ్యాటింగ్ విషయంలో తగ్గిపోతారని తెలిపారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు టీంలోని ఏ స్టార్ బ్యాటర్ కూడా సరిగ్గా ఆడలేడని.. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏ టీం కూడా గెలవలేదని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో అదే జరుగుతోందని అందుకే ఇన్నేళ్ల నుంచి ఒక్క టైటిల్ కూడా కొట్టలేకపోయారని తెలిపారు.
“” యంగ్ ఆటగాళ్లకు తక్కువ ఆర్డర్‌లో ఆడమని చెప్పి.. టాప్ పేరున్న బ్యాటర్లు మాత్రం టాప్ ఆర్డర్‌లో ఆడుతుంటారు. దీని వల్ల స్కోర్ పెరగదు. పేరున్న ఆటగాళ్లు ముందే ఆడేసి తర్వాత ఓవర్లను తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లకు ఇచ్చి వెళ్లిపోతుంటారు. ఆట ఆడుతున్న కొద్దీ గేమ్ టఫ్ అయిపోతున్న సమయంలో ఆ ఒత్తిడి తక్కువ అనుభవం ఉన్న ఆటగాళ్లపై పడుతోంది. ఇదే సమస్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎదురవుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టే టైటిల్ గెలవలేకపోతున్నారు “” అని తెలిపారు రాయుడు.