Viral News: త‌ల‌లో మొలుస్తున్న కొమ్ము..!

Viral News: పై ఫోటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తిని చూసారా..? పాపం ఇత‌ని త‌ల‌లో నుంచి కొమ్ము మొలుస్తోంది. దాంతో ఇత‌న్ని అంద‌రూ చీద‌రించుకోవ‌డం.. చూసి భ‌య‌ప‌డి పారిపోవ‌డం వంటివి చేస్తున్నారు. ఇత‌ని పేరు శ్యాం లాల్ యాద‌వ్. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని సాగ‌ర్ జిల్లాలోని ర‌హ్లి అనే గ్రామంలో ఉంటాడు.

2014లో శ్యాం లాల్ త‌ల‌కు గాయం అయ్యింది. అప్ప‌టినుంచి ఆ గాయం పెద్ద‌గా అవుతూ వ‌స్తోంది. తీరా చూస్తే అది గాయం కాదు త‌ల నుంచి మొలుస్తున్న కొమ్ము అని అర్థ‌మైంది. అది ఏటా ఎద్దుల‌కు పెరిగిన‌ట్లు పెరిగిపోతోంద‌ట‌. దాంతో దాని పొడ‌వు పెరిగిన ప్ర‌తీసారి శ్యాం లాల్ క‌త్తితో కోసేస్తున్నాడ‌ట‌. పూర్తిగా తొల‌గించేందుకు వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా.. అది ఒక ర‌క‌మైన చ‌ర్మ స‌మ‌స్య అని పెద్ద‌ల్లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంద‌ని అన్నారు. అది క్యాన్స‌ర్ కూడా అవ్వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. దానిని స‌ర్జ‌రీతో తొల‌గించేయ‌చ్చ‌ని చెప్పారు. కానీ శ్యాం లాల్ వ‌ద్ద డ‌బ్బుల్లేక అలాగే జీవించేస్తున్నాడు.