Raghu Rama: రాజ‌కీయాల‌కు గుడ్‌బై..?

Raghu Rama: మాజీ ఎంపీ ర‌ఘు రామ కృష్ణం రాజు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా? అవున‌నే అంటున్నాయి తాజా ప‌రిణామాలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ర‌ఘురామ‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వ‌డంతో ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు జైల్లో ఉన్న‌ప్పుడు కూడా త‌న వంతు ఎంతో సాయం చేసారు.

ఇంత చేసాక ఆయ‌న‌కు నిరుత్సాహమే ఎదురైంది. తెలుగు దేశం నుంచి కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి కానీ ఆయ‌న న‌ర‌సాపురం టికెట్ ఆశించారు. కానీ అది ఆయ‌న‌కు ద‌క్క‌లేదు. దాంతో ఇంత చేస్తే త‌న‌కు టికెట్ కూడా ఇవ్వ‌లేరా అని చాలా సార్లు మీడియా ముందు చెప్పుకుని బాధ‌ప‌డ్డారు. టికెట్ రాక‌పోయినా ఫర్వాలేద‌ని చంద్ర‌బాబు నాయుడు మ‌ద్ద‌తు ఇస్తాన‌ని అన్నారు.

“” జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై నేను చేసిన పోరాట‌మే నాకు శాప‌మా? ఎటువంటి అపేక్ష‌లు లేకుండా నాకు రాజ‌కీయ స్వార్ధం ఉంటే నేనూ పార్టీ పెట్టేవాడిని. నేను కోరుకున్న‌ది ఈ రాష్ట్రం అభివృద్ధినే. చంద్ర‌బాబు నాయుడు మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకుంటున్నా. జ‌గ‌న్‌పై పోరాటం నా గొప్ప‌ల కోసం చేసింది కాదు. తెలుగు దేశంలో కానీ భారతీయ జ‌న‌తా పార్టీలో చేరిన వారు జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్కరూ మాట్లాడ‌రు. అలా మాట్లాడితే నేను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. కూట‌మిని సీటు కూడా అడ‌గ‌ను “” అని త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు.