Medicines: ఈరోజు నుంచి ఈ మందుల‌పై ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయ్‌..!

Medicines: ఈరోజు నుంచి కేంద్ర ప్ర‌భుత్వం మందుల విష‌యంలో కీల‌క నిర్ణయాన్ని అమ‌లు చేసింది. ప‌లు అత్య‌వ‌స‌ర మందుల‌పై 12 శాతం చార్జీల‌ను పెంచింది. కొత్త ధ‌ర‌లు ఈరోజు నుంచే అమ‌ల్లోకి రానున్నాయి. 1000 అత్య‌వ‌సర ట్యాబ్లెట్లు, 384 మెడిసిన‌ల్ డ్ర‌గ్స్‌పై చార్జీలు పెరిగాయి. హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) పెర‌గ‌డంతో ధ‌ర‌లు పెంచాల్సి వ‌చ్చింది. ఈ WPI గ‌తేడాది జ‌న‌వ‌రి నుంచి ఈరోజు వ‌ర‌కు 12.12 శాతం పెరిగింది. కోవిడ్ 19కి సంబంధించిన మందుల నుంచి ఓఆర్ఎస్, డిస్ఇన్ఫెక్టెంట్స్ వ‌ర‌కు అన్నీ పెరిగాయి.

ఏ మందుల ధ‌ర‌లు పెరిగాయి?

పెయిన్ కిల్ల‌ర్స్ : డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెన‌మిక్ యాసిడ్, పారాసెట‌మాల్, మార్ఫైన్

యాంటీ టీబీ మందులు : Amikacin, Bedaquiline, Clarithromycin

యాంటీ కాన్వల్సెంట్స్: క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్

విషప్రయోగ విరుగుడులు: యాక్టివేటెడ్ చార్‌కోల్, డి-పెనిసిల్లమైన్, నాలాక్సోన్, స్నేక్ వెనమ్ యాంటీసెరమ్

యాంటీబయాటిక్స్: అమోక్సిసిలిన్, యాంపిసిలిన్, బెంజిల్పెనిసిలిన్, సెఫాడ్రాక్సిల్, సెఫాజోలిన్, సెఫ్ట్రియాక్సోన్
కోవిడ్ నిర్వహణ మందులు

రక్తహీనత మందులు: ఫోలిక్ యాసిడ్, ఐరన్ సుక్రోజ్, హైడ్రాక్సోకోబాలమిన్ మొదలైనవి.

పార్కిన్సన్స్ మరియు డిమెన్షియా: ఫ్లూనారిజైన్, ప్రొప్రానోలోల్, డోనెపెజిల్ (Medicines)

HIV మందులు: అబాక‌విర్, ల్యామివుడీన్, జీడోవుడీన్, ఎఫావిరెన్జ్, నెవీరాపైన్, రాల్టేగ్రావిర్, డాల్యుటేగ్రావిర్, రిటోనావిర్ మొదలైనవి.

యాంటీ ఫంగల్: క్లోట్రిమజోల్, ఫ్లూకోనజోల్, ముపిరోసిన్, నిస్టాటిన్, టెర్బినాఫైన్ మొదలైనవి.

గుండె సంబంధిత‌ మందులు: డిలిటాజెమ్, మెటోప్రోలోల్, డిగోక్సిన్, వెరాప్రమిల్, అమ్లోడిపైన్, రామిప్రిల్, టెల్మిసార్టెన్ మొదలైనవి.

చర్మసంబంధమైన మందులు

ప్లాస్మా, ప్లాస్మా ప్రత్యామ్నాయాలు

యాంటీవైరల్ మందులు: ఎసిక్లోవిర్, వల్గాన్సిక్లోవిర్, మొదలైనవి.

మలేరియా మందులు: ఆర్టెసునేట్, ఆర్టెమెథర్, క్లోరోక్విన్, క్లిండామైసిన్, క్వినైన్, ప్రిమాక్విన్ మొదలైనవి.

క్యాన్సర్ చికిత్స మందులు: 5-ఫ్లోరోరాసిల్, ఆక్టినోమైసిన్ డి, ఆల్-ట్రాన్స్ రెటినోయిక్ యాసిడ్, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్, కాల్షియం ఫోలినేట్ మొదలైనవి.

యాంటిసెప్టిక్స్ మరియు క్రిమిసంహారకాలు: క్లోరోహెక్సిడైన్, ఇథైల్ ఆల్కహాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పోవిడిన్ అయోడిన్, పొటాషియం పర్మాంగనేట్ మొదలైనవి.

హాలోథేన్, ఐసోఫ్లోరేన్, కెటామైన్, నైట్రస్ ఆక్సైడ్ మొదలైన సాధారణ మత్తుమందులు మరియు ఆక్సిజన్ మందులు.