KCR: ఆ రోజే వ‌చ్చుంటే… అధికారంలోకి వ‌చ్చుండె..!

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి.. భార‌త రాష్ట్ర స‌మితి అధినేత KCR ప్ర‌స్తుతం రైత‌న్న ప్ర‌యోజనాల కోసం పొలం బాట ప‌ట్టారు. న‌ల్గొండ‌, సూర్యాపేట జిల్లాల్లో ఆయ‌న రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే కేసీఆర్ ఈ ప‌ని చేసి ఉంటే క‌చ్చితంగా హ్యాట్రిక్ కొట్టి ఉండేవారు. ఆయ‌న ప్ర‌జ‌ల్లోకి రాకపోవ‌డం.. ప్ర‌జా ద‌ర్బార్ పెట్ట‌క‌పోవ‌డం వ‌ల్లే స‌గం ఓట్ల‌ను కోల్పోయార‌న్న టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో కేసీఆర్ చేప‌ట్టిన ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా చెప్పుకునేలా లేవు. రోజులో రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరిగి ఒక‌టే పాయింట్‌ను ప‌ట్టుకుని రిపీట్ చేసేవారు. 119 సీట్ల‌లో ఆయ‌న ఒకే ర‌కమైన ప్ర‌చారం చేయడంతో ప్ర‌జ‌ల‌కు కూడా ఎక్క‌లేదు.

అదే ఆయ‌న ఈరోజు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చిన‌ట్లు వ‌చ్చి స‌మ‌స్య‌లు తెలుసుకుని ఉంటే గెలిచేవారే. ఆనాడు అది చేయ‌లేక ఓడిపోయిన కేసీఆర్‌కు ఈరోజు పార్టీలో సంక్షేభం ఎదుర్కొనేలా చేస్తోంది. లోక్ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ నేత‌లు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. వారిలో కేసీఆర్‌కు ఎంతో ఆప్తిమిత్రుడు.. రైట్ హ్యాండ్ అయిన కేశ‌వ‌రావు కూడా ఉన్నారు.

దాంతో ఎలాగైనా క‌నీసం ఎంపీ ఎన్నిక‌ల్లో అయినా గెలిచి పార్టీని మ‌ళ్లీ య‌థాస్థితికి తీసుకురావాల‌ని కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఒక్క‌సారి కూడా ఇప్ప‌టివ‌ర‌కు అసెంబ్లీలో అడుగుపెట్ట‌ని కేసీఆర్.. ఈసారి ఓట‌మి భ‌యంతో ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. మ‌రి ఈ కార్య‌క్ర‌మం కేసీఆర్‌ను ఆయ‌న పార్టీని లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గ‌లిపిస్తుందో లేదో చూడాలి.