YS Sharmila: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్ర‌క‌టించిన ష‌ర్మిళ‌

YS Sharmila: భార‌తీయ జ‌న‌తా పార్టీతో (BJP) తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ది (Pawan Kalyan) స‌క్ర‌మ పొత్తు అయితే.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది (YS Jagan Mohan Reddy) అక్ర‌మ పొత్తు అని అన్నారు APCC చీఫ్ వైఎస్ షర్మిళ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తారో వెల్ల‌డిస్తూ మేనిఫెస్టోని ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో వివ‌రాలు ఇలా ఉన్నాయి

మొద‌టి గ్యారెంటీ: కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోకి వ‌చ్చాక మొద‌టి గ్యారెంటీ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అని తెలిపారు ష‌ర్మిళ‌. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాహుల్ గాంధీ ప్ర‌త్యేక హోదాపై సంత‌కం చేస్తార‌ని అన్నారు. దాదాపు ప‌దేళ్ల పాటు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఉంటుందని తెలిపారు.

రెండో గ్యారెంటీ: మ‌హిళా మ‌హాల‌క్ష్మి పేరుతో ప్ర‌తి పేద ఇంటి ఆడ‌ప‌డుచుకు ప్ర‌తి నెల రూ.8500 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంటే సంవ‌త్స‌రానికి ల‌క్ష రూపాయ‌లు. దీని ద్వారా ప్ర‌తీ పేదింటి మ‌హిళ త‌న బిడ్డ‌ల‌కు అన్నం పెట్టుకుని వారిని బాగా చూసుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. జ‌గ‌న్ అమ్మ ఒడి కింద ప్ర‌తి ఇంటికి రూ.15000 ఇస్తామని చెప్పాడ‌ని.. కానీ అదే స్థాయిలో ఖ‌ర్చులు పెరిగిపోవ‌డంతో ఆ రూ.15000 దేనికీ స‌రిపోవ‌డం లేద‌ని అన్నారు. అదే కాంగ్రెస్ ప్ర‌భుత్వం అమ‌ల్లోకి వ‌స్తే ప్ర‌తి ఇంటికి రూ.ల‌క్ష ఇస్తామని తెలిపారు.

మూడో గ్యారెంటీ: రైతుల‌కు రుణ మాఫీ కింద రూ.2 లక్ష‌ల వ‌ర‌కు ఖాతాల్లో వేస్తామ‌ని తెలిపారు.

నాలుగో గ్యారెంటీ: గ‌తంలో దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఉపాధి హామీ ప‌థ‌కాన్ని తీసుకొచ్చార‌ని.. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వాలు మారాక ఆ ప‌థ‌కం పోయింద‌ని ష‌ర్మిళ అన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే ఉపాధి కూలీల‌కు రోజూ కూలి కింద రూ.400 ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

ఐదో గ్యారెంటీ: రాజ‌శేఖ‌ర్ రెడ్డి అధికారంలో ఉన్న‌ప్పుడు ఫీజ్ రీయింబ‌ర్స్‌మెంట్ చేసార‌ని.. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద పిల్లుల కేజీ నుంచి పీజీ వ‌ర‌కు ఉచితంగా చ‌దువుకోవ‌చ్చ‌ని తెలిపారు.

ALSO READ: AP Elections: అవినాష్‌ను ఓడించేందుకు చెల్లెళ్లు ఏం చేయ‌బోతున్నారు?