దేవుడా.. మాజీ వియ్యంకుడితో హీరోయిన్ తల్లి డిన్నర్ డేట్!
Malaika Arora: ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో వారికే తెలియాలి. తమ కంటే పదేళ్ల చిన్న వయసు వారిని ప్రేమించడం.. మరొకరిని ప్రేమిస్తూ మాజీ భర్తతోనూ టచ్‌లో ఉండటం.. ఇవన్నీ బాలీవుడ్‌కి కొత్తేం కాదు. నటి మలైకా అరోరా విషయంలో ఇది బాగా సూట్ అవుతుంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను (Arbaaz Khan) ప్రేమించి పెళ్లి చేసుకున్న మలైకా అతనితో కుమారుడిని కని.. 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో (Arjun kapoor) డేటింగ్లో ఉంది. నిజానికి అర్బాజ్‌కు విడాకులు ఇవ్వడానికి ముందే మలైకా అర్జున్‌తో ప్రేమలో ఉందని టాక్.
వీరి సంగతి పక్కన పెడితే.. మలైకా అరోరా తల్లి జాయిస్.. (Joyce) తన వియ్యంకుడు, సల్మాన్ ఖాన్ తండ్రి అయిన సలీమ్ ఖాన్‌తో (Salim Khan) డిన్నర్ డేట్‌కు వెళ్లడం మరో షాకింగ్ అంశం. వీరితో పాటు మలైకా కూడా ఉంది. సలీమ్ ఖాన్, జాయిస్ కలిసి రెస్టారెంట్ నుంచి బయటికి రావడంతో స్థానిక ఫోటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీసేసారు. ఇవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఇదేం ఫ్యామిలీరా బాబూ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే.. ఇటీవల మలైకా మాజీ భర్త అర్బాన్ ఖాన్ షూరా ఖాన్ అనే మేకప్ ఆర్టిస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఇక మలైకా తన ప్రియుడు అర్జున్ కపూర్‌ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.