Allu Arjun: ఇద్దరిని భరిస్తావా క్యూటీ.. భార్యతో బన్నీ స్వీట్ మూమెంట్స్
Allu Arjun: దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అల వైకుంఠపురంలోని రెడ్ సూట్ వేసుకున్న స్టిల్‌ను మైనపు విగ్రహంగా తీర్చిదిద్దారు. బొమ్మ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని ఫ్యాన్స్ కూడా తెగ ఖుష్ అయిపోయారు. అయితే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి బన్నీ తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్లను తీసుకుని దుబాయ్ వెళ్లారు. మైనపు బొమ్మతో స్నేహ ఫోటోలు దిగుతుంటే.. ఇద్దరిని భరించగలవా క్యూటీ అంటూ బన్నీ స్వీట్ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ ఫోటోలను స్నేహ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. “” ఎవరైతే ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక ముద్రను వదులుతాడో ఇప్పుడు అతని శాశ్వత మైనపు విగ్రహం తయారైంది. తన భార్యను అయినందుకు ఎంతో గర్విస్తున్నా. ఈ క్షణం మా జీవితాల్లో చిరకాలం నిలిచిపోతుంది “” అని పేర్కొన్నారు.