Vijay Devarakonda: రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌మాట నిజ‌మే

Vijay Devarakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి ఏ కొత్త సినిమా వ‌చ్చినా ఆ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఫ్యాన్స్ ముఖ్యంగా అడిగే ప్ర‌శ్న మీ పెళ్లి ఎప్పుడు? ఎవ‌రితో అయినా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నారా అని. ఇప్పుడు ఆయ‌న న‌టించిన ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా ప్ర‌మోష‌న్స్‌లో కూడా ఇదే ప్ర‌శ్న ఎదురైంది. దీనిపై విజ‌య్ స్పందిస్తూ.. రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాను కానీ త‌న త‌ల్లిదండ్రులు, త‌మ్ముడు ఆనంద్, ఫ్యాన్స్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాను అని మాట దాటేసారు.

చాలా కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న (Rashmika Mandanna) రిలేష‌న్‌షిప్‌లో ఉన్నార‌ని.. ర‌ష్మిక విజయ్ ఇంట్లో ఉంటోంద‌న్న టాక్ వినిపిస్తోంది. వినిపించ‌డ‌మే కాదు క‌నిపించింది కూడా. చాలా సార్లు ర‌ష్మిక పోస్ట్ చేసే ఫోటోలు విజయ్ పోస్ట్ చేసే ఫోటోల్లో ఒకే ఇల్లు క‌నిపిస్తోంది. వెకేష‌న్ల‌కు కూడా క‌లిసే వెళ్తున్నారు. ఈ 2024లో చాలా మంది సెల‌బ్రిటీలు పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. దాంతో విజ‌య్, ర‌ష్మిక‌లు కూడా త‌మ ప్రేమ విష‌యాన్ని ఇప్ప‌టికైనా బ‌య‌ట‌పెడ‌తారేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇక విజ‌య్ న‌టించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. ప‌ర‌శురామ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. గీత గోవిందం త‌ర్వాత విజ‌య్, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో సినిమా ఇది. కాక‌పోతే ఇందులో ర‌ష్మికను కాకుండా మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. మొన్న రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైల‌ర్ అయితే అదిరిపోయింది. ఇక సినిమా ఎలా ఉంటుందో ఏప్రిల్ 5న తెలిసిపోతుంది.

ALSO READ: పార్టీ కావాల‌ని అడిగిన రష్మిక‌.. విజ‌య్ రియాక్ష‌న్ ఇదే