Prabhakar Reddy: రేయ్ పిచ్చోడా.. నాతో పెట్టుకోకు

Prabhakar Reddy:  భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) నేత ర‌ఘునంద‌న్ రావు.. (Ragunandan Rao) భార‌త రాష్ట్ర స‌మితి (BRS) నేత కొత్తా ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ర‌ఘునంద‌న్ రావు ప్ర‌భాక‌ర్ రెడ్డిని ఇంటికి వ‌చ్చి కొడ‌తా అని షాకింగ్ కామెంట్స్ చేసారు. హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి నా పేరు తీస్తే మీ ఇంటికొచ్చి కొడతా నా కొడకల్లారా అని రెచ్చిపోయారు. దీనిపై కొత్తా ప్ర‌భాక‌ర్ రెడ్డి స్పందిస్తూ.. బిడ్డ నీకంటే ఎక్కువ మాట్లాడగలను. కానీ నాకు సంస్కారం ఉంది. పిచ్చోడా పార్లమెంట్‌లో మీ నలుగురు ఎంపీల కంటే ఎక్కువ ప్రశ్నలు నేనే వేసా చూసుకోరా అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.