వివాహం అవ్వడానికి పరమేశ్వరుడు చెప్పిన పరిష్కారం

Spiritual: చాలా మంది ఇళ్ల‌ల్లో ఏద‌న్నా కామ‌న్ స‌మ‌స్య ఉందంటే.. అది వారి పిల్ల‌ల‌కు వివాహాలు జ‌ర‌గ‌క‌పోవ‌డం. ఇది చాలా ఆవేద‌న‌కు గురిచేసే అంశం. ఇలాంటి స‌మ‌స్య ఎవ‌రి ఇంట్లో ఉన్నా స‌రే.. దానికి రామాయణంలో సీతా క‌ళ్యాణం ప్ర‌యోగం బాగా ప‌నిచేస్తుంది. ఇది చేయ‌గ‌లిగితే త‌ప్ప‌కుండా పెళ్లి జ‌రుగుతుంది. ఇది సాక్షాత్తు ప‌ర‌మేశ్వ‌రుడు చెప్పిన విష‌యం.

ఇంతకీ ఏం పారాయ‌ణం చేయాలి? రామాయ‌ణం బాల‌కాండ‌లో 73వ స‌ర్గ పారాయణం, దీనినే సీతా క‌ళ్యాణ స‌ర్గ అంటారు. ఈ స‌ర్గలో మొద‌టి శ్లోకం.. య‌స్మింస్తు దివ‌సే రాజా చ‌క్రే గోదాన‌ముత్త‌మ‌మ్ త‌స్మింస్తు దివ‌సే శూరః యుధాజిత్స‌ముపేయివాన్ అనే శ్లోకంతో మొద‌ల‌వుతుంది. దాదాపు 40 శ్లోకాలు ఉన్నాయి. ఇది మొత్తం చేయ‌డానికి ఏడు నిమిషాలు ప‌డుతుంది. ప్ర‌తి రోజు ఉద‌యం స్నానం అయ్యాక త‌ల్లో తండ్రో త‌మ పెళ్లి కాని పిల్ల‌ల‌ను ప‌క్క‌న కూర్చోపెట్టుకుని చేయాలి. సాధార‌ణంగా వివాహం అవ్వ‌డంలేదు అంటే అది స‌మిష్టి ఖ‌ర్మ‌. ముగ్గురి ఖర్మ ఉంటే ముగ్గురూ బాధ‌ప‌డ‌తారు. అందుకే ముగ్గురూ క‌లిసి చేయ‌గ‌లిగితే చాలా అద్భుతంగా ప‌నిచేస్తుంది.

ఒక‌వేళ మీ త‌ల్లిదండ్రులు వేరే ప్ర‌దేశంలో మీరు వేరే ప్ర‌దేశంలో ఉన్న‌ట్లైతే.. రోజూ ఒక స‌మ‌యం పెట్టుకుని ఎవ‌రి ఇళ్ల‌ల్లో వారు ఈ శ్లోకాల‌ను చ‌దువుకుంటే స‌రిపోతుంది. ఈ పారాయ‌ణం చేస్తే పెళ్లి కాని వారికి త‌ప్ప‌కుండా జ‌ర‌గుతుంద‌ని సాక్షాత్తు శివ‌య్యే పార్వ‌తి దేవితో చెప్పార‌ని పురాణాల్లో రాసి ఉంది.