డబ్బుతో పరారైన YSRCP నేత.. ఎవరతను?
YSRCP: జేబుకు ఫ్యాన్ గుర్తు.. చేతిలో జగన్ బొమ్మ పట్టుకుని అందరికీ నమస్కారం పెడితే ఓట్లు పడతాయని ప్యాలెస్ పెద్దలు ఓ YSRCP నేతకు నూరిపోసారనే చర్చ జరుగుతోంది. చివరకు తాను ఏడో తరగతి తప్పానని చెప్పిన తర్వాత కూడా ఎవరు చూస్తారు పదో తరగతి తప్పినట్లు రాయిస్తామని చెప్పి ఆయన్న తాడేపల్లిగూడెం ప్యాలెస్‌కు తీసుకెళ్లిన మంత్రి భరోసా ఇచ్చారట. ముందుగా చెప్పినట్లుగానే డబ్బు పంపారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పటినుంచో జగన్‌తో సంబంధాలు ఉన్న సొంత సామాజిక నేతను మొత్తం వ్యవహారం దగ్గరుండి చూసుకోమని బాధ్యతలు అప్పగించారు.
పంపిన డబ్బుకు కూడా సొంత కుల నేతనే ఇన్‌ఛార్జిగా పెట్టారు. నియోజకవర్గంలోని మండలాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించారు. పంపిన డబ్బు నాలుగు రోజుల్లో అయిపోయిందనే టాక్ నడుస్తోంది. దీంతో బాధ్యతలు అప్పగించిన నేత తాపీగా సెలవిచ్చారు. దాంతో కంగుతిన్న అభ్యర్ధి అసలు విషయాన్ని పార్టీ సీనియర్ నేతలకు చెప్పడంతో వారు తాము మాట్లాడతామని నమ్మబలికారన్న చర్చ సాగుతోంది. నాలుగు రోజుల తర్వాత ఈ విషయం తాడేపల్లిగూడెంలోని పెద్దలకు తెలిసిపోయిందట.
బాధ్యతలు అప్పగించిన నేతను తాడేపల్లికి రావాల్సిందిగా ఫోన్ చేసారట. అసలు విషయం తెలిసిపోయిందని ఆ నేత ఫోన్ స్విచ్చాఫ్ చేసి అందుబాటులో లేకుండా జంప్ అయ్యారని తెలుస్తోంది. ఇచ్చిన డబ్బుకు లెక్క చెప్పకుండా వెళ్లడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసినా ఉపయోగం లేకుండాపోయింది. బయటికి చెప్దామంటే బ్లాక్ మనీ విషయం వెలుగులోకి వస్తుందనే టెన్షన్‌తో ఉన్నారు.
పిలిచి పంచాయతీ పెడదామంటే సొంత మనిషి అని సైలెంట్ అయిపోయారట. ఈ డబ్బు విషయంలో మరో నేతకు బాధ్యతలు అప్పగించగా ఆయన కూడా అలాగే చేసారని ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం జగన్‌కి సన్నిహితంగా ఉండే మరో నేతకు బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం అయ్యారు. కోట్లల్లో పోయిన సొమ్మును ఎలా రాబట్టుకోవాలో అర్థంకాక తలలు బాదుకునే పరిస్థితి నెలకొంది. ఎవరికి చెబుదామన్నా అందరూ సొంత పార్టీ నేతలు కావడంతో ప్రస్తుతానికి పెదవి విప్పడం లేదని అంటున్నారు. తాడేపల్లికి వస్తే కాళ్లు విరగ్గొడతామని అంటున్నారు. ఆ సొమ్ముతో రెండు నెలల పాటు ఎంజాయ్ చేసిన నేతలు.. ఈసారి వైసీపీ అధికారంలోకి రాదు కాబట్టి తనను ఏం చేస్తారు అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారట. ఇప్పుడు వైసీపీలో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మాట్లాడినట్లు తెలుస్తోంది.