SRH vs MI: స‌న్‌రైజ‌ర్స్.. సొంత మైదానంలో ఇర‌గ‌దీసారంతే..!

SRH vs MI: IPL-2024లో భాగంగా MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH ప్లేయర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన SRH 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ 63, హెడ్ 62 పరుగులతో రాణించగా, చివరల్లో క్లాసెన్ 80, మార్ర్కమ్ 42 మెరుపులు మెరిపించారు. కాగా, IPL చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోర్.

రికార్డును తిర‌గ‌రాసిన అభిషేక్

16 బాల్స్‌లోనే అర్థ సెంచ‌రీ బాదిన అభిషేక్ శ‌ర్మ రికార్డును తిర‌గ‌రాసాడు. సొంత మైదానంలో దుమ్ము లేపేసారు. ఈరోజు నిజంగా హైద‌రాబాద్‌కు పండుగే. అభిమానులు రాకెట్లు, టాపాసులు పేలుస్తూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక స్కోర్ చేసింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Banglore). వారి స్కోర్ 263 ఉంది. ఇప్పుడు మ‌న హైద‌రాబాద్ ఆటగాళ్లు 278కు తీసుకొచ్చి IPL చ‌రిత్ర‌లోనే సంచ‌ల‌నం సృష్టించారు.