SRH vs MI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

SRH vs MI: PL-2024లో భాగంగా మరికాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, ఈ రెండు జట్లు తొలి మ్యాచ్​లలో ఓడిపోగా, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి బోణీ కొట్టాలని తహతహలాడుతున్నాయి.