Raghu Rama: ప్రాణాలకు తెగించి తెదేపా కోసం జగన్తో పోరాడా
Raghu Rama: ప్రాణాలకు తెగించి జగన్ మోహన్ రెడ్డితో పోరాడితే తనకు తెలుగు దేశం పార్టీ నరసాపురం టికెట్ ఇవ్వలేదని బాధపడ్డారు రఘురామ కృష్ణంరాజు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు రఘురామ తనకు తోచిన సాయం చేసారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనకు తెలుగు దేశం నుంచి నరసాపురం టికెట్ వస్తుందని ఆశించారు. కానీ ఆయన ఆశ అడియాసైంది.
దాంతో ఆయనను బుజ్జగించేందుకు విజయనగరం ఎంపీ టికెట్ ఇవ్వాలని తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. దీనిపై రఘురామ మాట్లాడుతూ.. “” నాది నరసాపురం. నేను అక్కడి నుంచే పోటీ చేస్తా. విజయనగరం నుంచి పోటీ చేయాల్సిన అవసరం నాకేముంది? నేను ప్రాణాలకు తెగించి జగన్తో పోరాడాను. అలాంటి నాకు తెలుగు దేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎలా? తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలలో ఏ పార్టీ నుంచైనా నాకు చంద్రబాబు నాయుడు నరసాపురం టికెట్ ఇప్పిస్తారని ఆశిస్తున్నా. చంద్రబాబు భారతీయ జనతా పార్టీని నమ్మి నరసాపురం సీటు ఇచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ సీటును వేరే అభ్యర్ధికి ఇచ్చేసింది.
కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరం పూర్తి చేస్తానని అంటున్న చంద్రబాబు మాటలను ప్రజలు ఎలా నమ్ముతారు. చంద్రబాబు నాయుడు నాకే న్యాయం చేయలేనప్పుడు ఇక ప్రజలకు ఏం చేస్తారు? నేను చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. భారతీయ జనతా పార్టీ ముందు ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారు. నరసాపురం సీటును నాకు ఇవ్వమని అడిగినా భారతీయ జనతా పార్టీ ఇవ్వదు. అలాంటిది నిధులు ఇస్తుందంటే ఎలా నమ్మాలి?“” అని ప్రశ్నించారు రఘురామ