Virat Kohli: నాకు ఆ గుర్తింపు వ‌ద్దు.. అందుకే దూరంగా ఉన్నాను

Virat Kohli: టీమిండియా మాజీ సార‌థి విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ (Anushka Sharma) దంప‌తులు ఇటీవ‌ల పండంటి మ‌గ పిల్లాడికి జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. బాబు పేరు అకాయ్ అని వెల్ల‌డిస్తూ విరాట్ ఈ శుభ‌వార్త‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. అనుష్క కోసం విరాట్ రెండు నెల‌ల పాటు ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. ఫ్యామిలీతో ఉండాల‌న్న ఉద్దేశంతో ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కి కూడా విరాట్ దూరంగా ఉన్నాడు. దీని గురించి విరాట్ మాట్లాడుతూ..

“” నేను నా భార్య గ‌ర్భిణిలా ఉన్న‌ప్పుడు భార‌త్‌లో మాత్రం ఉండ‌కూడ‌దు అనుకున్నాను. నేను అనుష్క ఇంగ్లాండ్‌కు వెళ్ల‌డానికి కార‌ణం ఏంటంటే.. అక్క‌డ మమ్మ‌ల్ని ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌రు. మేం సాధార‌ణం దంప‌తుల్లా ఉంటాం. మాకు కావాల్సింది కూడా అదే. ఆ రెండు నెల‌లు నేను నా కుటుంబంతో ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడ‌నందుకు బాధ‌లేదు. ఎందుకంటే ఆ స‌మ‌యంలో నాకు నా కుటుంబంతో ఉండ‌టం ముఖ్యం. నాకు ఇలాంటి క్లిష్ట స‌మయాల్లో ఎక్క‌డికి వెళ్లినా వ‌చ్చే గుర్తింపు వ‌ద్దు. అందుకే ఆట‌కు దూరంగా ఉండాల‌నుకున్నాను “” అని తెలిపారు.

ఇక‌పోతే.. ఈసారి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బోణీ కొట్టింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు క‌ప్ గెల‌వ‌డంతో ఇప్పుడు క‌ళ్ల‌న్నీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మీదున్నాయి.