CSK vs GT: హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి?

CSK vs GT: చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో IPL 2023 ఫైనల్ కూడా ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్‌ 3 సార్లు గెలుపొందగా, చెన్నై 2 సార్లు విజయం సాధించింది. టార్గెట్ ఛేదించే సమయంలో గుజరాత్ టైటాన్స్ గెలవగా.. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూప‌ర్ కింగ్స్ ఒకసారి, ఛేజింగ్‌లో మరోసారి విజయం సాధించింది. చెన్నైలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. IPL 2023 మొదటి క్వాలిఫయర్‌లో ఇరుజట్లు తలపడ్డాయి. ఇక్కడ ఎంఎస్ ధోని (MS Dhoni) కెప్టెన్సీలో చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ‌రి ఈరోజు మ్యాచ్‌లో ఏం జ‌ర‌గ‌బోతుందో వేచి చూడాలి.