Arvind Kejriwal అరెస్ట్.. అమెరికా స్పంద‌నేంటి?

Arvind Kejriwal: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) ఇటీవ‌ల అరెస్ట్ అయిన అర‌వింద్ కేజ్రీవాల్‌పై అగ్ర‌రాజ్యం అమెరికా స్పందించింది. కేజ్రీవాల్ విష‌యంలో లీగ‌ల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాల‌ని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించింది. కొన్ని రోజుల క్రితం కేజ్రీవాల్ అరెస్ట్‌పై జ‌ర్మ‌నీ స్పందిస్తూ అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింది. ఓ సాధార‌ణ భార‌తీయ పౌరుడి విష‌యంలో ఎలాగైతే విచార‌ణ జ‌రుపుతారో కేజ్రీవాల్ విష‌యంలోనూ అలాగే జ‌ర‌గాల‌ని స‌ల‌హా ఇచ్చింది. దీనిపై భార‌త ప్ర‌భుత్వం మండిప‌డింది. మీ స‌ల‌హా ఎవ్వ‌రూ అడ‌గ‌లేదు. మా అంత‌ర్గ‌త విష‌యాల్లో జోక్యం చేసుకుని మమ్మ‌ల్ని త‌క్కువ చేసి చూడ‌కండి అని క్లాస్ పీకింది.

అమెరికా స్పంద‌న‌పై ఇంకా భార‌త ప్ర‌భుత్వం కానీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కానీ స్పందించ‌లేదు. కేజ్రీవాల్ సాధార‌ణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కాదు. ఆయ‌న దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీకి ముఖ్య‌మంత్రి. అందుకే ఇత‌ర దేశాలు కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందిస్తున్నాయి.