Anam: ఒరేయ్ పొట్టి సారాయి రెడ్డి.. రెచ్చిపోయిన ఆనం

Anam Venkata Ramana Reddy: YSRCP ఎంపీ విజ‌య సాయి రెడ్డిపై (Vijaya Sai Reddy) తెలుగు దేశం పార్టీ  (Telugu Desam Party) నేత ఆనం వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి రెచ్చిపోయారు. ఒరేయ్ పొట్టి సారాయి రెడ్డి అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేసారు.

“” ఒరేయ్ పొట్టి సారాయి రెడ్డి.. నీకు ఆస్తులు లేవా? వాటాలే లేవా? జ‌గ‌న్ కంపెనీల్లో స‌గం వాటాలు నీవి కాదా? విజ‌య సాయి రెడ్డికి ఎన్ని కంపెనీల్లో వాటాలు ఉన్నాయో నాకు తెలుసు. అబ‌ద్ధాలు చెప్తున్న సారాయి రెడ్డిని న‌మ్మ‌డానికి నెల్లూరు ప్ర‌జ‌లు చెవుల్లో పూలు పెట్టుకున్నారా? ప‌చ్చి అబ‌ద్ధాలు చెప్పే నిన్ను ఏమ‌నాలి? ఒక దొంగ‌వి నువ్వు. ఎన్నో కంపెనీల్లో మోసం చేసి వేల కోట్లు దోచుకున్న దొంగ ఈ విజ‌య సాయి రెడ్డి.. పొట్టి సారాయి రెడ్డి.

ప్ర‌జ‌ల కోస‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను అంటున్న ఈ సారాయి రెడ్డి 2010లో వేణుంబాక పేరుతో ఓ ఫౌండేష‌న్ పెట్టాడు. వేణుంబాక అంటే సారాయి రెడ్డి ఇంటి పేరు. ఈ ఫౌండేష‌న్ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ఖ‌ర్చు పెట్టింది సున్నా. అలాంటి ఈ పొట్టి సారాయి రెడ్డి ప్ర‌జ‌ల‌కు సాయం చేస్తాడ‌ట‌. ఒక్క రూపాయి కాదు క‌దా న‌యా పైసా ఖ‌ర్చు పెట్టిన దాఖ‌లాలు లేవు. ఈ నెల్లూరు బిడ్డ సారాయి రెడ్డికి రూ.50 కోట్లు ఎంపీ ల్యాడ్స్ కింద వ‌స్తే నెల్లూరుకు ఎంత ఖ‌ర్చు పెట్టాడో చెప్ప‌మ‌నండి. వీఆర్ కాలేజీలో మా నాన్నే నీకు సీటు ఇచ్చాడు రా సారాయి రెడ్డి. నువ్వు ఒక దొంగ అని తెలీక మా నాన్న నీకు సీటు ఇచ్చాడు.“” అంటూ రెచ్చిపోయారు ఆనం