Kavitha ED Investigation: కవితకు బిగుస్తున్న ఉచ్చు.. తిహార్ జైలుకేనా?
Kavitha ED Investigation: ఢిల్లీ లిక్కర్ పాలసీలో (Delhi Liquor Policy) అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కూడా అరెస్ట్ అయ్యారు. అయితే.. కవిత రిమాండ్ రేపటితో ముగియనున్న నేపథ్యంలో కవితను కేజ్రీవాల్‌ను కలిపి విచారించాలని ఈడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయనుందట. మరోపక్క గత రెండు రోజుల పాటు కవితను ఈడీ విచారించినప్పుడు కీలక ప్రశ్నలు వేసిందట. ఈ రెండు రోజుల విచారణలో కీలక అంశాలు బయటపడ్డాయని సమాచారం.
లిక్కర్ స్కాంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శరణ్ మాత్రం ఈడీ నోటీసులను పట్టించుకోలేదని.. విచారణకు హాజరుకాలేదని టాక్. మొత్తానికి కేజ్రీవాల్, కవితకు ఉచ్చు బిగుస్తోందని.. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న వీరిద్దరినీ త్వరలో తిహార్ జైలుకు తరలించే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.