బాలీవుడ్​ బ్యూటీతో పవన్​ యాక్షన్​ సీక్వెన్స్​!

వరుస సినిమాలతో యంగ్​ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ మెగా హీరో.. ప్రస్తుతం నాలుగైదు ప్రాజెక్టుల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తోన్న సినిమాల్లో ఒకటి ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్​ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. మొఘల్ సామ్రాజ్యం నాటి పరిస్థితుల నేపథ్యంతో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ చాలాకాలం కిందటే ప్రారంభమైంది. కానీ, పవన్​ మిగతా సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. అయినా టాకీ పార్ట్​ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందుకు అనుగుణంగానే షెడ్యూళ్లను ప్లాన్ చేస్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త హల్​చల్​ చేస్తోంది.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ మూవీలో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తోన్నారు.

ముఖ్యంగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నెగెటివ్ రోల్‌ను నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీలో అత్యంత ముఖ్యమైన ప్రీ క్లైమాక్స్ షూట్‌ను ఏప్రిల్ 11వ తేదీ నుంచి జరపబోతున్నారట. ఇందులో పవన్ కల్యాణ్ – నోరా ఫతేహీ మధ్య కొన్ని యాక్షన్ సీన్స్‌ను షూట్ చేస్తారని తెలిసింది. ముఖ్యంగా ఇదంతా కత్తులతో సాగే యుద్ధంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో సినిమాలో వీళ్ల కాంబోపై అంచనాలు క్రమంగా పెరుగుతోన్నాయి.‘హరిహర వీరమల్లు’ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ కాగా.. నిధి అగర్వాల్ కీలక పాత్రను చేస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు

ప్రస్తుతం, పవన్ కల్యాణ్ సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయా సిత్తం రీమేక్​ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ సినిమాలో పవన్​ షూటింగ్​ పార్ట్​ పూర్తయినట్లు సముద్ర ఖని సోషల్​ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో పవన్​ కల్యాణ్​ ప్రత్యేక పాత్రలో కనిపించనుండగా ప్రధాన పాత్రలో మెగా హీరో సాయి ధరమ్​ తేజ నటిస్తున్నారు.