Tillu Square: మ‌రీ ఇంత త‌క్కువ ర‌న్‌టైమా?

Tillu Square: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ (Siddu Jonnalagadda) న‌టించిన టిల్లు స్వ్కేర్ సినిమా మ‌రీ త‌క్కువ ర‌న్‌టైంతో రాబోతోంది. శుక్ర‌వారం రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న టిల్లు స్వ్కేర్ సినిమా నిడివి కేవ‌లం గంట 58 నిమిషాలు మాత్ర‌మే. ఇటీవ‌ల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. డీజే టిల్లు ఎలాగైతే బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా ఇంకా మీమ్స్ రూపంలో వైర‌ల్ అవుతోందో.. అంత‌కుమించి హిట్ కొడుతుంద‌ని సిద్ధు కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇక ఇందులో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించారు.