AP Elections: BJPలో YCP కోవ‌ర్టు.. ఎవ‌ర‌ది?

AP Elections: భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) తెలుగు దేశం, జ‌న‌సేన (Janasena) పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టికీ.. అధికార YSRCPకి తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. న‌ర‌సాపురం టికెట్ ఆశించిన ర‌ఘురామ కృష్ణంరాజుకు (Raghu Rama Krishnam Raju) టికెట్ రాక‌పోవ‌డం వ‌ల్లే ఈ ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సోము వీర్రాజుతో కుమ్మ‌క్కైన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) త‌న‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి కానీ ఇటు తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీల నుంచి కానీ న‌ర‌సాపురం టికెట్ రానివ్వ‌కుండా చేసార‌ని ర‌ఘురామ ఆరోపించారు. ఓప‌క్క తెలుగు దేశం, జ‌న‌సేన‌తో పొత్తులో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ పైకి మాత్రమే YSRCPని విమ‌ర్శిస్తోంది. లోలోప‌ల YSRCPకి బాగా మ‌ద్ద‌తు ఇస్తోంద‌ని టాక్.

న‌ర‌సాపురంలో ర‌ఘురామ గెలిచే అభ్య‌ర్ధే. అందులో ఎలాంటి సందేహం లేద‌ని స‌ర్వేలు కూడా చెప్తున్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు గెలిచే అభ్య‌ర్ధికి టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. న‌రసాపురంలో YSRCP పార్టీకి చెందిన అభ్య‌ర్ధి గెల‌వాల‌నో.. లేక జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా మారిన ర‌ఘురామ‌కు టికెట్ ఇవ్వ‌కూడ‌దో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. వైసీపీకి భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఎవ‌రో కోవ‌ర్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ చాలా గట్టిగానే ఉంది. రఘురామ కృష్ణంరాజు కనుక భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి నరసాపురం అభ్యర్థి కాకపోతే.. భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క గ్యారంటీ సీటు కూడా లేనట్టే! నరసాపురం సీటు ర‌ఘురామకి ఇవ్వకపోవడం వల్ల పాలకొల్లు, నరసాపురం, తాడేపల్లి గూడెం అభ్యర్థులకు ఫండింగ్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.