JP Nadda భార్య కారు చోరీ..!

JP Nadda: భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారు చోరీకి గురైంది. ఢిల్లీ నివాసం నుంచి దొంగ‌లు కారును ఎత్తుకెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నెల 19న ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్ కేసు పెట్ట‌డంతో చేయడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నిక‌ల ముందు న‌డ్డా నివాసంలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప‌లు అనుమానాల‌కు దారి తీస్తోంది.