Raghu Rama Krishnam Raju: జ‌గ‌నే నాకు టికెట్ రాకుండా చేసాడు

Raghu Rama Krishnam Raju: YSRCP అస‌మ్మ‌తి నేత‌గా ఉన్న ర‌ఘు రామ కృష్ణంరాజు ఆ త‌ర్వాత పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం, జ‌న‌సేన కూట‌మితో క‌లిసారు. ఆయ‌న తెలుగు దేశం నుంచి న‌ర‌సాపురం సీటులో పోటీ చేస్తార‌ని అంతా అనుకున్నారు. ర‌ఘురామ కూడా ఆ సీటు త‌న‌కే ద‌క్కుతుంద‌ని ఆశ‌ప‌డ్డారు. కానీ ఎప్పుడైతే కూట‌మిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చేరిందో.. న‌ర‌సాపురం సీటు ర‌ఘురామ‌కు ద‌క్క‌కుండా పోయింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భార‌తీయ జ‌న‌తా పార్టీతో కలిసి త‌న‌కు న‌ర‌సాపురం సీటు రాకుండా చేసాడ‌ని ఆరోపించారు. సోము వీర్రాజు ద్వారా భార‌తీయ జ‌న‌తా పార్టీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి జ‌గ‌న్ త‌న‌కు సీటు రానివ్వ‌కుండా చేసాడ‌ని ఆరోపించారు. దీనిని తాత్కాలిక ఓట‌మిగా భావిస్తున్నాన‌ని.. నరసాపురం నుండే పోటీలో ఉంటానా లేక ఇంకో చోట నుండా అనేది తొందరలో చెప్తాన‌ని అన్నారు.