Rashmi Gautam: నేనొక్క ఫోటో పెడితే చొంగ కార్చుకుంటారు

Rashmi Gautam: యాంక‌ర్ రష్మి గౌత‌మ్ సామాజిక అంశాల‌పై ఎక్కువ‌గా ట్విట‌ర్ వేదిక‌గా చ‌ర్చిస్తుంటారు. ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ట్వీట్ చేస్తుంటారు. త‌న‌ను ట్రోల్స్ చేసేవారికి కూడా అంతే ఘాటుగా స‌మాధానాలు ఇస్తుంటారు. తాజాగా ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్ జొమాటో (Zomato) తీసుకొచ్చిన కొత్త ఆప్ష‌న్ గురించి ర‌ష్మి త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. జొమాటో ప్యూర్ వెజ్ మోడ్ ఆప్ష‌న్ వెజ్ ఓన్లీ అని మార్చింది. దాంతో వెజ్ ఆర్డ‌ర్ల‌ను గ్రీన్ రంగు దుస్తుల్లో డెలివ‌రీ చేయాల‌ని జొమాటో కొత్త విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనిపై ర‌ష్మి స్పందిస్తూ.. గ్రీన్ రంగు దుస్తుల్లో ఆర్డ‌ర్ డెలివ‌రీ చేసే అంశంపై చాలా మందికి ఉన్న నొప్పేంటి? అని ప్ర‌శ్నించారు.

హ‌లాల్ స‌ర్టిఫైడ్ ఆహార ప‌దార్థాల‌ను అంగీక‌రించిన‌ప్పుడు ప్యూర్ వెజ్ ఆహారాన్ని ఎందుకు అంగీక‌రించ‌లేక‌పోతున్నారు అని అన్నారు. వంట‌ల్లో వాడే ఆహార ప‌దార్థాల‌పై దృష్టి సారించాలి కానీ మ‌తం గురించి ఎందుకు చ‌ర్చిస్తున్నారు అని మండిప‌డ్డారు. ఈ ట్వీట్ చూసిన ఓ నెటిజ‌న్ స్పందిస్తూ.. పాపులారిటీ కోసం ఇలాంటివి చేస్తున్నారు అని అన్నాడు. దీనికి ర‌ష్మి త‌న‌దైన స్టైల్‌లో రిప్లై ఇచ్చారు. నాకు పాపులారిటీ కావాలంటే ఒక్క ఫోటో పెడితే చాలు. మీరంతా చొంగ కార్చుకుంటూ జూమ్ చేసి మ‌రీ నా ఫోటోను చూస్తారు. నేను అటెన్ష‌న్ కోసం సామాజిక అంశాల‌పై మాట్లాడ‌ను అన్నారు.