Arvind Kejriwal కు బిగ్ షాక్.. 10 రోజుల పాటు ED కస్ట‌డీలోనే

Arvind Kejriwal: ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో అరెస్ట్ అయిన ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఆయ‌న‌కు ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు క‌స్ట‌డీ విధించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ వాదనతో ఢిల్లీ న్యాయ‌స్థానం ఏకీభ‌వించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా కొనసాగుతారా లేదా రాజీనామా చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కేసు విచార‌ణ‌ను ఆల్రెడీ అరెస్ట్ అయిన భార‌త రాష్ట్ర స‌మితి (BRS) ఎమ్మెల్సీ కవితతో కలిపి విచారించే అవకాశం ఉంది.