CSK vs RCB: బాగా ప్రిపేర్ అయ్యాం.. టాస్ గెలిచాం.. బ్యాటింగ్ చేస్తాం
CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPK 2024) తొలి మ్యాచ్‌లో భాగంగా తలపడనున్న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Banglore) మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డ్యు ప్లెస్సి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ఫాఫ్ మాట్లాడుతూ.. చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చామని.. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించాలని అనుకుంటున్నామని తెలిపారు. సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌ని చూడటం ఆనందంగా ఉంది కానీ తన సపోర్ట్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే అని పేర్కొన్నారు.