Arvind Kejriwal: జైల్లో కేజ్రీవాల్.. సీఎంగా వ్వవహరించవచ్చా?
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (Delhi Liquor Scam) ఆయన్ను నిందితుడిగా పేర్కొంటూ నిన్న ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి నుంచి కేజ్రీవాల్ ఈడీ లాకప్‌లోనే ఉన్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ తాత్కాలిక ముఖ్యమంత్రిని ఇంత వరకు నియమించలేదు. కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. మరి జైల్లో ఉన్న కేజ్రీవాల్ సీఎం బాధ్యతలను చేపట్టవచ్చా? రూల్స్ ఏం చెప్తున్నాయి?
జైలు రూల్స్ ప్రకారం కేజ్రీవాల్ వారంలో రెండు మీటింగ్స్ మాత్రమే ఉంటాయి. ఆయన తన కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఉంటుంది. ఈ రూల్‌తో ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపించడం అసాధ్యం. అయితే లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఒక పవర్ ఉంది. అదేంటంటే.. ఏ భవనాన్నైనా ఆయన జైలుగా ప్రకటించవచ్చు. ఈ రూల్‌తో కేజ్రీవాల్‌ను తన అధికారిక నివాసంలో హౌస్ అరెస్ట్ చేసే పవర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఉంటుంది. ఒకవేళ ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే కేజ్రీవాల్ హౌజ్ అరెస్ట్ అవుతారు.
ఈ హౌజ్ అరెస్ట్ ప్రక్రియ కోసం కేజ్రీవాల్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక అరెస్ట్ అయిన నేపథ్యంలో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా కింది స్థాయి ట్రయల్ కోర్టును ఆశ్రయించనున్నారు.