Sapta Sagaradaache Ello: షాకింగ్.. OTT నుంచి ర‌క్షిత్ శెట్టి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా తొల‌గింపు

Sapta Sagaradaache Ello: ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి (Rakshit Shetty) న‌టించిన స‌ప్త సాగ‌ర‌దాచే ఎల్లో (తెలుగులో సప్త స‌ముద్రాలు దాటి) పార్ట్ బిని OTT నుంచి తొల‌గించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైంలో రిలీజ్ అయింది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasant) న‌టించిన ఈ సినిమాను రెండు భాగాలుగా తీసారు. మొద‌టి భాగం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

దాంతో రెండో భాగానికి కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రెండో భాగం రిలీజ్ అవ్వ‌గానే ఓటీటీలో మంచి వ్యూయ‌ర్ షిప్ వ‌చ్చింది. ఈ సినిమా రెండో భాగం OTTలో జ‌న‌వరి 25న రిలీజ్ అయ్యింది కానీ ఏం జ‌రిగిందో ఏమో రెండో భాగాన్ని అమెజాన్ ప్రైం నుంచి తొల‌గించేసారు. సినిమాను డిలీట్ చేయ‌డానికి కార‌ణం జీ5 సంస్థ అని అంటున్నారు. ఈ సినిమా హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైం కంటే ఎక్కువ పెట్టి మ‌రీ జీ5 సంస్థ ద‌క్కించుకుంద‌ట‌. దాంతో అమెజాన్ ప్రైం నుంచి తొలగించిన‌ట్లు తెలుస్తోంది.