Paris Olympics: ఇక సెక్స్ చేసుకోవచ్చు.. 3 లక్షల కండోమ్‌ల పంపిణీ!
Paris Olympics: ఒలింపిక్స్‌కి సెక్స్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? విదేశాల్లో ఎక్కడైనా ఒలింపిక్స్ క్రీడలు జరిగితే నిర్వాహకులే క్రీడాకారులకు ఉచితంగా కండోమ్స్ పంపిణీ చేస్తుంటారు. ఇది పెద్ద వింతేమీ కాకపోవడం గమనార్హం. ఈసారి ప్యారిస్‌లో ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాకారులు సెక్స్‌లో పాల్గొనవచ్చని ఒలింపిక్స్ విలేజ్ డైరెక్టర్ లారెంట్ మిచౌండ్ వెల్లడించారు. క్రీడాకారులకు 3 లక్షల వరకు కండోమ్‌లు ఉచితంగా పంపిణీ కూడా చేస్తామని వెల్లడించారు.
2020లో అథ్లెట్లు సెక్స్‌లో పాల్గొనడానికి వీల్లేదని బ్యాన్ విధించారు. ఆ బ్యాన్‌ను ఇప్పుడు తొలగించేసారు. పోయిన సారి జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ కండోమ్స్ పంచారు కానీ కోవిడ్ కారణంగా అథ్లెట్లు సెక్స్‌లో పాల్గొనలేకపోయారు. 1988లో జరిగిన సియోల్ ఒలింపిక్స్‌లో ఈ కండోమ్స్‌ను పంచారు. హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రక్రియను ప్రారంభించారు. అప్పటి నుంచి నెమ్మదిగా కండోమ్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2000లో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌లో నిర్వాహకులు 70వేల కండోమ్‌లు పంపిణీ చేసారు. కానీ అవి తక్కువ అవడంతో మరో 20 వేల కండోమ్‌లు పంచిపెట్టారు. 2016 రియో ఒలింపిక్స్ సమయంలో 4 లక్షల 50వేల కండోమ్‌లు పంచారు. అయితే ఒలింపిక్స్ విలేజ్ పరిసరాల్లో మద్యం మాత్రం సేవించకూడదని.. కావాలంటే పారిస్‌లో మద్యం సేవించేందుకు అనుమతి ఉందని లారెంట్ తెలిపారు.