Viral News: మ‌సాజ‌ర్‌ను సెక్స్ టాయ్‌గా ప‌రిగ‌ణించ‌లేం.. తేల్చిచెప్పిన కోర్టు

Viral News: బాడీ మ‌సాజ‌ర్ల‌ను సెక్స్ టాయ్స్‌గా ప‌రిగ‌ణించ‌లేం అని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ‌స్తువు దిగుమ‌తుల‌పై ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌డానికి వీల్లేద‌ని.. అన్ని మార్కెట్ల‌లో మ‌సాజ‌ర్ అందుబాటులో ఉంద‌ని వెల్ల‌డించింది.  2022 ఏప్రిల్‌లో క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌ర్ మ‌సాజ‌ర్లలు క‌లిగి ఉన్న లోడ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీటిని విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న‌ సెక్స్ టాయ్స్‌గా ప‌రిగ‌ణించాల‌ని 1964 జ‌న‌వ‌రిలో క‌స్ట‌మ్స్ నోటిఫికేష‌న్ వెలువ‌డింద‌ని పేర్కొన్నారు. దాంతో మ‌సాజ‌ర్ల కంటైన్మెంట్‌ను త‌ర‌లిస్తున్న సంస్థ 2023 మేలో క‌మిష‌న‌ర్‌కు వ్య‌తిరేకంగా బాంబే హైకోర్టులో పిటిష‌న్ వేసింది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన న్యాయ‌మూర్తులు ఈరోజు తీర్పు వెల్ల‌డించారు. హైకోర్టు న్యాయ‌మూర్తులు కంటైన్మెంట్‌ను స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌ర్‌పై మండిప‌డ్డారు. దిగుమ‌తి అయ్యే అన్ని వ‌స్తువుల‌ను సెక్స్ టాయ్స్‌లా చూసే ఆలోచ‌న మానుకోవాల‌ని.. అస‌లు మ‌సాజ‌ర్‌ను సెక్స్ టాయ్‌లా ఎలా ఊహించుకున్నార‌ని చివాట్లు పెట్టారు.