Ruturaj Gaikwad: CSK కెప్టెన్‌గా రుతురాజే ఎందుకు? అతని ముందున్న సవాళ్లేంటి?
Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) దిగిపోయారు. ఆయన స్థానంలో మళ్లీ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వస్తారనుకున్నారు కానీ ఈసారి కెప్టెన్సీ ఛాన్స్ కుర్రాడైన రుతురాజ్ గైక్వాడ్‌కు దక్కింది. గత కొన్నేళ్లుగా రుతురాజ్ గైక్వాడ్ తన ఆటతీరుతో సీనియర్ ఆటగాళ్ల మనసు కొల్లగొడుతున్నాడు. ధోనీని సైతం మెప్పించిన గైక్వాడ్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించింది.
గైక్వాడ్ ముందున్న సవాళ్లేంటి?
తొలిసారి ఐపీఎల్ సీజన్‌కు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గైక్వాడ్ ముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఒక టీంకు కెప్టెన్‌గా వ్యవహరించడం అంటే చిన్న విషయం కాదు. గతంలో మహేంద్ర సింగ్ ధోనీ ఈ సవాళ్లను భరించలేకే తన కెప్టెన్సీని రవీంద్ర జడేజాకు అప్పగించారు. రవీంద్ర జడేజా కూడా ఎక్కువ కాలం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేదు. దాంతో మళ్లీ ధోనీనే చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్ అయ్యారు. ఇప్పుడు గైక్వాడ్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ అంశాలపై ఫ్యాన్స్, ఐపీఎల్ యాజమాన్యం దృష్టి సారిస్తుంది.
*చెన్నై సూపర్ కింగ్స్ గత ఏడాది ఐపీఎల్‌లో ఘన విజయం సాధించింది. సూపర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. గైక్వాడ్ కూడా ఆ విజయ పరంపరను కొనసాగించాలి. లేదంటే తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
*ధోనీ ప్లానింగ్ చాలా బాగుంటుంది. చాలా ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటాడు. చాకచక్యంగా వ్యవహరిస్తుంటాడు. గైక్వాడ్ కూడా ధోనీలాగే ఆలోచించాలి. టీం సెలెక్షన్, బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌లో కిటుకులు తెలిసి ఉండాలి. (Ruturaj Gaikwad)
*ఇప్పుడు రుతురాజ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ కాబట్టి ఇతర ఆటగాళ్లను మించి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇప్పుడు రుతురాజ్ ఆట తీరుపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది.
*టీంలో పాజిటివిటీ పెంచాల్సిన బాధ్యత గైక్వాడ్ పైనే ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా టీంకు అండగా నిలబడాలి.
*ఎక్కువ ఒత్తిడి, సవాళ్లు ఉన్నప్పుడు కూల్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీకి ఇది వెన్నతో పెట్టిన విద్య. ధోనీని స్ఫూర్తిగా తీసుకునే గైక్వాడ్ కూడా ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి.
*మేనేజ్‌మెంట్, ఆటగాళ్లు, కోచ్‌లతో క్లియర్‌గా సంభాషించాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్యాలేంటి.. మార్పులేంటి.. ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అనే అంశాలపై టీంకు క్లారిటీ ఉంటుంది.