తిరుపతి- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వేళలు ఇవే!

తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పూర్తి సమాచారాన్ని ద.మ.రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి మధ్య నడిచే ఈ రైలును ఈ నెల 8న ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైలు నంబర్లు, సమయాలు, నిలిచే స్టేషన్ల వివరాలను ద.మ.రైల్వే విడుదల చేసింది.

సికింద్రాబాద్‌- తిరుపతి (20701) రైలు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి నల్గొండ (07:19), గుంటూరు(9:45), ఒంగోలు(11:09), నెల్లూరు(12:29) మీదుగా తిరుపతికి మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంటుంది. అలాగే తిరుపతి- సికింద్రాబాద్‌ (20702) రైలు తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయలుదేరి నెల్లూరు (5:20), ఒంగోలు (6:30), గుంటూరు (7:45), నల్గొండ (10:10) మీదుగా సికింద్రాబాద్‌కు రాత్రి 11:45 గంటలకు చేరుకోనుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు రైలు నడవనుంది. తిరుపతి-సికింద్రాబాద్‌ రైలు ఈ నెల 9న ప్రారంభమవుతుంది. ఈ వందే భారత్ రైలు…. మంగళవారం మినహా అన్ని రోజులు రాకపోకలు సాగిస్తుంది.