Ravichandran Ashwin: మ‌హేష్ బాబు డ్యాన్స్‌పై అశ్విన్ కామెంట్స్

Ravichandran Ashwin: క్రికెట‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్… సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) డ్యాన్స్‌పై కామెంట్స్ చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాను అశ్విన్ చూసార‌ట‌. ఇందులోని ఆ కుర్చీని మ‌డ‌త‌పెట్టి పాట‌లో మ‌హేష్ బాబు డ్యాన్స్‌పై అశ్విన్ త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. “” మ‌హేష్ బాబుది గుంటూరు కారం అనే సినిమా ఉంది. ఆస‌క్తి ఉంటే చూడండి. అందులో మ‌హేష్ బాబు డ్యాన్స్ ఇర‌గ‌దీసాడు. అఫ్‌కోర్స్ శ్రీలీల కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం చాలా వినోదాత్మ‌కంగా ఉంది “” అని తెలిపారు అశ్విన్.