Lok Sabha Elections: విశాఖ ఎంపీ టికెట్ వార్..!
Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్ధులు ఒకే టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆ స్థానమే విశాఖపట్నం. విశాఖ ఎంపీ స్థానం ఎవరిది అనే ఆతృత నెలకొంది. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) గెలిచారు.
అంతకుముందు 2014లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు అదే విశాఖపట్నం నుంచి తనకు సీటు కావలని పురంధేశ్వరి కోరుతున్నారు. మరోపక్క ఇదే సీటును ఆశిస్తున్నారు భారతీయ జనతా పార్టీకి చెందిన జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao). సీటు తనదేనన్న ధీమాతో ఉన్నారు. మూడేళ్లకు పైగా విశాఖలో జీవీఎల్ పనిచేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు పట్టును సాధించారు. ఇలాంటి సమయంలో పురంధేశ్వరి వచ్చి విశాఖ సీటు తనకు కావాలి అనడంతో జీవీఎల్ షాక్ అయ్యారు. దాంతో ఈ సీటుపై కాస్త సందిగ్ధత నెలకొంది. సీటును ఎవరికి ఇవ్వాలా అని భారతీయ జనతా పార్టీ హై కమాండ్ చర్చలు జరుపుతోంది.