Samantha: ఒకే ఈవెంట్‌లో సామ్‌, నాగ చైత‌న్య‌..!

Samantha: టాలీవుడ్ న‌టీన‌టులు, మాజీ దంప‌తులు నాగ చైత‌న్య‌ (Naga Chaitanya), స‌మంత ఒకే ఈవెంట్‌లో మెరిసారు. అమెజాన్ ప్రైం (Amazon Prime) ఈవెంట్‌లో పాల్గొన్న వీరిద్ద‌రూ త‌మ త‌దుప‌రి ప్రాజెక్ట్‌ల‌ను ప్ర‌క‌టించారు. నాగ చైత‌న్య న‌టిస్తున్న ధూత 2 (Dhootha 2) అమెజాన్ ప్రైంలో రిలీజ్ కానుంది. ఇక స‌మంత న‌టించిన సిటాడెల్ (Citadel) సిరీస్ కూడా అమెజాన్ ప్రైం వేదిక‌గానే రిలీజ్ కానుంది. వీరిద్ద‌రూ ఈవెంట్‌కి రాగానే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ వీరిని వేరు వేరుగా స్టేజ్‌పైకి పిలిచి ముచ్చ‌ట్టు చెప్పారు.