Hardik Pandya విష‌యంలో ఏం జ‌రిగింది?

RIP Hardik Pandya: ఒక్క క్షణం హార్దిక్ పాండ్య అభిమానుల‌కు గుండె ఆగినంత ప‌నైంది. కాళ్ల కింద నేల కంపించిన‌ట్లు అనిపించింది. ఎందుకంటే.. ఈరోజు ఉద‌యం నుంచి X (ట్విట‌ర్)లో #RIP Hardik Pandya అనే హ్యాష్ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దాంతో త‌మ అభిమాన ఆట‌గాడికి ఏం జ‌రిగిందా అని ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. ఆ హ్యాష్ ట్యాగ్ మీద క్లిక్ చేసి చూస్తే కానీ తెలీలేదు కొంద‌రు రోత నెటిజ‌న్లు చేసిన నీచ‌పు ప‌ని అని.

అస‌లేం జ‌రిగింది?

ఈసారి ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో (IPL 2024) భాగంగా ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) సార‌థిగా హార్దిక్ పాండ్య‌ను (Hardik Pandya) నియ‌మించిన సంగ‌తి తెలిసిందే. ఇది వ‌ర‌కు గుజ‌రాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) సార‌థిగా వ్య‌వ‌హ‌రిస్తూ వచ్చిన హార్దిక్‌కు ముంబై ఇండియ‌న్స్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. దాంతో ముంబై ఇండియ‌న్స్ మాజీ సార‌థి రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) ఫ్యాన్స్ ఎంతో హ‌ర్ట్ అయ్యారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు ఓ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు.

ఆ స‌మ‌యంలో ఓ రిపోర్ట‌ర్ హార్దిక్‌ను ఓ ప్ర‌శ్న అడిగారు. రోహిత్ శ‌ర్మ‌ను తీసి మిమ్మ‌ల్ని కెప్టెన్‌గా పెట్ట‌డానికి గ‌ల కార‌ణం ఏంటి? గుజ‌రాత్ టైటాన్స్ సార‌థిగా శుభ్‌మ‌న్ గిల్‌ను ఎంపిక చేయ‌డంపై మీ అభిప్రాయం ఏంటి? అని అడిగారు. ఇందుకు హార్దిక్ స‌మాధానం చెప్ప‌కుండా మౌనంగా బిత్త‌ర చూపులు చూస్తూ కూర్చున్నాడు. దాంతో రోహిత్ ఫ్యాన్స్ హార్దిక్ పాండ్య‌ను ట్విట‌ర్‌లో ఓ రేంజ్‌లో ఏసుకున్నారు. మ్యాట‌ర్ లేనోడిని అడిగితే ఇలాగే ఉంటుంది అంటూ అనే RIP Hardik Pandya హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టి వేలాది ట్వీట్స్ చేసారు.